విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ ఎయిర్‌పోర్ట్...! 5 h ago
TG : వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. మామునూరు విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై సమీక్షించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా ఎయిర్‌పోర్ట్ ఉండాలన్నారు. కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని వివరించారు. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించాలని సీఎం రేవంత్ సూచించారు.